పట్నంలో రోడ్లకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు

Published: Friday November 26, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : రోడ్లను ఆక్రమించి ఇష్టానుసారంగా వ్యాపారాలు చేపట్టినందున  ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ యూసుఫ్, సి ఐ సైదులు, ఎస్ ఐ లు, వెంకటేష్, రామస్వామి, ట్రాఫిక్ ఎస్ ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారికి  ఇరువైపులా  ఉన్న ఆక్రమణలను తొలగించి  వేశారు. గతంలో పెద్దగా ఉన్న రోడ్లు కాస్తా చిరు వ్యాపారాల ఆక్రమణల కారణంగా కుంచించుకుపోయాయి. వ్యాపార సముదాయాల ముందు నిలుపిన సుమారు 50 వాహనాలను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది  మొదటగా అంబేద్కర్ చౌరస్తాచుట్టూ రోడ్డు ఆక్రమణలు తొలగించడానికి పూనుకున్నారు. నిత్యం ఆర్టీసీ బస్టాండ్, ఫారెస్ట్ ఆఫీస్, అంబేద్కర్ కూడలి తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నందున ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జేసీబీతో ఆక్రమ డబ్బాలు, పూల బండ్లు, బట్టల వ్యాపారాలు తొలగించారు. మున్సిపల్  కాలనీల్లో అక్రమంగా నిర్మించిన ర్యాంపులు, అడ్డుకట్టలు తొలగిస్తామని దీనికి ప్రజలు సహకరించాలనీ కోరారు. ఉదయం పూట చెత్తను రోడ్లపై పారబోస్తున్న వ్యక్తులను గుర్తించి జరిమానా విధిస్తామన్నారు. పలు కాలనీల్లో శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి వెంటనే తొలగించాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా చికెన్ సెంటర్ నిర్వాహకులకు కోళ్ల వ్యర్ధాలను చెరువుల్లో కుంటల్లో వేస్తున్నారని అలా కాకుండా మునిసిపల్ వారు ప్రైవేటు వాహనం పంపిస్తారని  వ్యర్ధాలను అందులో మాత్రమే యాలని లేనిచో కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం పినల్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో అక్రమణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఇది నిరంతర ప్రక్రియ అని కమిషనర్ ఎండి యూసుఫ్  హెచ్చరించారు