రోడ్డుపై బతుకమ్మ అడుతు నిరసన తెలిపిన గ్రామ రెవెన్యూ సహాయకులు

Published: Saturday July 30, 2022
కోరుట్ల, జూలై 29 (ప్రజాపాలన ప్రతినిధి):
గ్రామ రెవెన్యూ సహాయకులు తమ యొక్క డిమాండ్ పరిష్కారం కొరకు ఐదవరోజు ఆర్డిఓ కార్యాలయం ఎదురుగా సమ్మె నిర్వహించారు. మహిళా వీఆర్ఏలు వినూత్నంగా బతుకమ్మ ఆడుతూ తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన తెలియజేసారు. ఈ సమ్మె కార్యక్రమంలో సంఘీభావం తెలపడానికి కాటిపల్లి శ్రీనివాస్, కోరుట్ల మండల బిజెపి అధ్యక్షులు చిరుమల్ల ధనుంజయ్, బిజెపి నాయకులు సుధవేని మహేష్  మరియు ఇతర బిజెపి నాయకులు, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, నియోజకవర్గ ఇన్చార్జి గుజ్జరి ప్రకాష్, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల డివిజన్ విఆర్ఏ జేఏసీ చైర్మన్ గుడిసెల గంగాధర్, కో-చైర్మన్ కనక లక్ష్మణ్, జిల్లా కో కన్వీనర్లు చింతల వీరయ్య, బినవేని మురళి, సువర్ణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి రోడ్డ పోచయ్య, సంపత్ కుమార్ అశ్విన్, నహేదా బాను, శిరీష, స్వప్న, శ్యాం కుమార్, జుపతి నరేంధర్, డప్పు గంగాధర్, సుధీర్, సంజయ్ పాల్గొన్నారు.