పరిసరాల శుభ్రత పాటించని వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి.

Published: Thursday September 08, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 07, ప్రజాపాలన: పరిసరాల శుభ్రత పాటించని వార్డెన్ పై చర్యలు తీసుకోవాలాని, సి ఐ టి యు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో ఉన్నటువంటి ఆశ్రమ బాలికల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న వి. లక్ష్మి అనే విద్యార్థిని మంగళవారం  రాత్రి పాఠశాల ఆవరణలో పాము కాటుకు గురైందని, వెంటనే  హాస్టల్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇది ఇలా ఉంటే  హాస్టల్ చుట్టూ ఉన్నటువంటి మైదానం అంతా గడ్డితో, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దీనిని శుభ్రం చేయకపోవడంతో   బయట నుండి పాములు లోపలికి వస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా హాస్టల్ వార్డెన్  స్పందించి  హాస్టల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా, గడ్డిని పిచ్చి మొక్కలను తొలగించాలని విద్యార్థినిలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.