మంచిర్యాల పట్టణంలో ఐదు రోజులు సంపూర్ణ బంద్.

Published: Friday April 30, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 29, ప్రజాపాలన : మంచిర్యాల పట్టణంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వ్యాపిస్తూ,  పట్టణ ప్రజలను వ్యాపారులను అనారోగ్యానికి గురి చేస్తున్నందున తప్పనిసరి పరిస్థితులలో మే ఒకటి నుండి మే 5 వరకు ఐదు రోజుల సంపూర్ణ బంద్ ప్రకటించడం జరిగిందని చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్షుడు గుండా సుధాకర్ గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల పట్టణ ప్రజల మరియు వ్యాపారస్తుల క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ విషయంపై పట్టణంలోని అన్ని వ్యాపార సంస్థల ప్రతినిధులను సంప్రదించి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.  మే ఒకటి నుండి మే 5 వరకు మంచిర్యాల పట్టణంలో అత్యవసర సర్వీసులు అయినా మెడికల్ షాప్స్, పాలు, పండ్లు, కూరగాయలు, చికెన్ సెంటర్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు, వినియోగదారులు, అందరూ వ్యాపారస్తులు ఈ ఐదు రోజులు పూర్తి  బంద్ కు  సహకరించగలరని ఆయన కోరారు.