నుకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మేల్యే డా. సంజయ్

Published: Friday September 23, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 22(ప్రజాపాలన ప్రతినిధి): పట్టణములో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నుకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్లను ప్రజా ప్రతినిదులు, అధికారులతో కలిసి  ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణ నిరుపేద ప్రజల చిరకాల కోరిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణమని నూక పల్లి లోని 4520 డబుల్ బెడ్రూం నిర్మాణాలను ఈరోజు ప్రజా ప్రతినిదులు, నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని ఇక్కడి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాష్ట్రానికే తలమానికం అని, లక్ష జనాభా ఉన్న ఏ పట్టణంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో డబల్ బెడ్ రూం నిర్మాణాలు జరగడంలేదని, దాదాపు 20 వేల మంది ఆత్మ గౌరవం తో ఉండాలనే ఈ కార్యక్రమం ద్వారా గూడు  ను కల్పిస్తున్నామని త్వరలోనే పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. దాదాపు 70 శాతం నిర్మానాలు పూర్తయ్యాయని, నిర్మాణాలను స్థానిక  టిఆర్ఎస్ నాయకులతో, అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని అన్నారు. కరోనా మహమ్మారి వల్ల కొంత ఆలస్యం అయినా బడుగు బలహీన వర్గాలకు, దళిత, మైనార్టీ వర్గాలకు, బిసి లకు అతి త్వరలోనే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏలాంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా అందుతాయని, త్వరలోనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని భరోసా కల్పించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజల పక్షాన ధన్యవాదాలు అని అన్నారు. ఎమ్మేల్యే వెంట వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, నాయకులు భోగ ప్రవీణ్, పిఎసిఎస్ ఛైర్మెన్ సాగర్ రావు, ఈఈ రహమాన్, డిఎస్పి ప్రకాష్, కమిషనర్ గంగాధర్, డిఈ లు మీలింధ్, రాజేశ్వర్, ఏఈ రాజ మల్లయ్య, సైట్ ఇంఛార్జి లీల మోహన్, అధికారులు, తదితరులు ఉన్నారు

 
 
 
Attachments area