భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చిలుకూరు గ్రామంలో కబడ్డీ పోటీలు

Published: Monday January 10, 2022
మధిర జనవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం చిలుకూరు గ్రామం లో లోపల్లె పల్లెకు క్రీడా మైదానాల స్థలాలు కేటాయించాలి DYFI జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్. ఈ సందర్భంగా మద్దాల ప్రభాకర్ ప్రభాకర్ మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు క్రీడల పట్ల శ్రద్ధ లేకపోవటం మరియు క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేకపోవడం క్రీడ మైదానాలు లేక పోవడం యువతకి క్రీడల పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ ఆర్థిక లేమి సదుపాయాలు లేకపోవడం వలన ఎందరో యువతీయువకులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించ లేకపోతున్నారన్నారు. ప్రతి గ్రామపంచాయతిలో స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం రైతు వేదికలు మాదిరిగానే ప్రతి గ్రామంలో క్రీడా స్థలాలు కేటాయించి అన్ని సదుపాయాలతో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు  అనంతరం  గెలుపొంది టీమ్స్ *పర్స ఏసోబు గారి జ్ఞాపకంగా వారి కుమారులు బెంజిమెన్ అయోధ్యలు మరియు కుక్కమళ్ళ రాజారావుగారు జ్ఞాపకంగా వారి కుమారుడు లెక్చలర్ విద్యాసాగర్ మరియు యువతను ప్రోత్సహిస్తూ బాదినేని నాగరాజు క్రీడాకారుని ప్రోత్సహిస్తూ బహుమతులను సర్పంచ్ వంశీకృష్ణ మద్దాల ప్రభాకర్ రైతు సంఘం నాయకులు మందా సైదులు ఓట్ల శంకర్రావు డాక్టర్ కిషోర్ చేతుల మీదగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు గణేషు సాయి, సాగర్, గోపి మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.