వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆర్డీఓ రవి మేయర్లు కార్పొరేటర్లు

Published: Wednesday September 29, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 28, (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో నిలిచి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల్లో కీసర ఆర్డిఓ రవితో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు పర్యటించారు. ముందుగా అల్మాస్ కుంటను పర్యటించి పైప్ లైన్ ద్వారా నీటిని మళ్లించాలని ఆర్డిఓ సూచించారు. అనంతరం చెంగిచెర్ల పోచమ్మ కుంట, చింతల చెరువు ప్రాంతాల్లో పర్యటించారు. నీటమునిగిన ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సింగిరెడ్డి పద్మారెడ్డి, పొగుల నర్సింహ రెడ్డి, పూలకండ్ల హేమలత జంగారెడ్డి, డీఈ కుర్మయ్య, ఆర్ఐ ఫనిందర్, ఇరిగేషన్ ఏఈ నీరజ, టీఆర్ఎస్ యువ నాయకులు కొత్త విక్రమ్ గౌడ్, కొత్త సాయి తేజ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.