తెలంగాణ రాష్ట్ర రాజకీయ భీష్ముడు గడ్డం వెంకట స్వామి

Published: Wednesday October 06, 2021
కోరుట్ల, అక్టోబర్ 05 (ప్రజాపాలన ప్రతినిధి): మంగళవారం రోజున కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ అద్యక్షులు కొంతం రాజం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ అధ్యక్షతన కీర్తిశేషులు గడ్డం వెంకట స్వామి (కాకా) జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కొంతం రాజం తిరుమల గంగాధర్ మాట్లాడుతూ  సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ కురు వృద్ధుడు గడ్డం వెంకట స్వామి. కాంగ్రెసు పార్టీ భీష్మాచార్యుడు, వారి 60 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయనను వరించిన పదవులు ఎన్నో ఉన్నాయని, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఆనాడు 1973లో హైదరాబాద్ లోని భాగ్ లింగంపల్లిలో భారత రాజ్యాంగ పితా మహుడు డా.బీ ఆర్ అంబెడ్కర్ విద్యాలయంను ఏర్పాటు చేసిన ఘనత కాకా కి దక్కిందని . తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అహర్నిశలు కృషి చేసిన కాకా తన చివరి సమయంలో రాష్ట్ర ఏర్పాటు ను కళ్ళారా చూసి తనువు చలించారని, నూతన రాష్ట్ర ఏర్పాటును చూసేందుకె బతికి ఉన్నానని ఆయన చివరి రోజుల్లో గుర్తు చేసుకునేవారు అని అన్నారు. కార్మిక, కర్షకుల కోసం నిరంతరం పోరాడే నాయకులు  అని, వెంకట స్వామి బడుగు బలహీన వర్గాలకు ఉద్యమ దిక్సుచి, ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియెజకవర్గ అద్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, కిసాన్ సెల్ పట్టణ అద్యక్షులు శ్రీరాముల, అమరేందర్ పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి మ్యాకల నర్సయ్య, సహయ కార్యదర్శి ఎంబేరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు