ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మా రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Friday February 11, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను హబ్సిగూడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తవిడబోయిన గిరిబాబు, మేడల మల్లికార్జున్ గౌడ్, గడ్డం దేవేందర్ రెడ్డి, పబ్బు గణేష్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు రాగిడి లక్ష్మారెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.