పాదయాత్రలో బండి సంజయ్ కు పలువురు దేవుని ప్రసాదం

Published: Tuesday September 28, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని దేవ దేవుని విగ్నేశ్వరుని లడ్డు ప్రసాదం అందజేసిన పలువురు నేతలు. బాలాపూర్ గణేశ్ లడ్డూ ప్రసాదాన్ని భాజపా సీనియర్ నాయకుడు మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి, అదేవిధంగా కార్పొరేషన్ 16వ డివిజన్ లో నున్న గణనాథుని లడ్డు ప్రసాదం కూడా పలువురు నేతలు కలిసి ప్రజా సంగ్రామ యాత్రలో అడుగులో అడుగై ముందుకు వెళుతున్న సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్ద లింగాపూర్ లో మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర ఎస్సీ మోర్చ అధ్యక్షులు కొప్పు భాష లతో పాటు కార్పొరేషన్ ఎస్సీ మోర్చాఅధ్యక్షుడు గుండె నాగార్జున బాబు కలిసి తెలంగాణ బిజెపి అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కు ఆ మహా గణపతి లడ్డు లను బహుమానంగా అందజేశారు. పలువురు బిజెపి శ్రేణులు మాట్లాడుతూ.. సంజయ్ పాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డి శ్రీశైలం, కొప్పుల శ్రీనివాస్, గైక్వాడ్ అశ్వంత్ బాబు, కొండల్ గౌడ్, లాలం కొండల్ తదితరులు పాల్గొన్నారు.