విద్యుత్ లైట్ల ఏర్పాట్లలో అవినీతి

Published: Tuesday October 19, 2021
విచారణ చేపట్టాలని అఖిలపక్షం డిమాండ్
బెల్లంపల్లి అక్టోబర్ 18 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసే వీది దీపాలు (లైట్ల) కొనుగోలులో అధికార పార్టీ నాయకుల అవినీతికి అంతు లేకుండా పోయిందని బెల్లంపల్లి పట్టణ అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. సోమవారం నాడు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ  పారదర్శకంగా నాణ్యం అయిన పనులు చేయుటకు ఈ ప్రాక్యూర్ మెంట్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో అన్ని ప్రభుత్వ రంగా సంస్థలు మున్సిపాలిటీలు విధిగా టెండర్ ప్రక్రియ ప్రభుత్వ ఉత్తరువు 94 మరియు 171 అనుసరించి ఈ ప్రాక్యూర్ మెంట్ ద్వారా టెండర్ పిలవాల్సి ఉండగా బెల్లంపల్లిలో అందుకు విరుద్ధంగా ఒక పని కి 2 లక్షల 75 రూపాయలతో నామినేషన్ పద్ధతిలో వర్క్ కేటాయిస్తు న్నారని అవి ఏ నిబంధన ప్రకారం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. విద్యుత్ లైట్లు మరియు సోలార్ లైట్ల రూపంలో ఒకే కంపెనీకి లక్షల రూపాయల పనులు నామినేషన్ పద్ధతులులో ఇయ్యటం జరుగుతుందని, లక్ష రూపాయలు దాటితే ఈ ప్రాక్యూర్ మెంట్ టెండర్ పిలవాల్సి ఉండగా 2 లక్షల రూపాయలు లోపు కొనుగోలుకు డి ఈ అనుమతి ఉండాలని కానీ 2 లక్షల 75 000 రూపాయలతో నిబంధనలు కు విరుద్ధంగా పనులు ఎలా కేటాయిస్తారని వారన్నారు. అది కేవలం ఒకే వ్యక్తి నామినేషన్ పద్ధతిలో ఇచ్చారని అదెలా సాధ్యమవుతుందని వారన్నారు. అయినా బెల్లంపల్లి పట్టణంలో చాలా ప్రాంతాలు చీకటిలో ఉంటున్నవని, ఒక లైట్ కి 2 లక్షల 75 000 కేటాయించారు అంటే ఎంత అవినీతి జరుగుతుందో ప్రజలు గమనించాలని, తక్షణమే బెల్లంపల్లి పట్టణంలో జరిగిన   పనులపై సమగ్ర దర్యాప్తు జరిపి ప్రజా దనం దుర్వినియోగం జరుగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ప్రజలు కట్టే పన్నులు ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని లేనిచో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం.సూరిబాబు, కాశీ, సతీష్ కుమార్, గెల్లీ జయరాం యాదవ్,  గోగర్లశంకర్, సంతోష్, అమానుల్లాఖాన్, బర్రె మధు నయ్య, ఆడెపు మహేష్, రేమ్మ క్రిష్ణ, బబ్లు బాయ్, జేఏసీ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.