క్రికెట్ కిట్ పంపిణీ చేసిన సర్పంచ్

Published: Saturday March 13, 2021

జన్నారం మార్చి 12 ప్రజా పాలన : మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు జాడీ గంగాధర్ ఆగ్రామ యువకులకు శుక్రవారం క్రికెట్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ యువత చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. క్రికెట్ ఆట తో యువతకు శరీర వ్యాయామం కూడా చేసినట్లవుతుందని అన్నారు. చెడు తోవ పట్టకుండా యువత ఆటలు పాటలు చదువులలో ముందుండి తమ తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.