రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పడాల సత్యం నరేష్..

Published: Saturday November 05, 2022
తల్లాడ, నవంబర్ 4 (ప్రజాపాలన న్యూస్):

ఐ.ఎస్.ఓ. గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్ధ  శ్రీశ్రీ కళావేదిక యువజన  కార్యవర్గం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఖమ్మంజిల్లా తల్లాడ మండలం బాలపేట గ్రామానికి చెందిన యువకవి, రచయిత పడాల సత్యం నరేష్ నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్  ఆదేశాలపై శ్రీ శ్రీ కళావేదిక  తెలంగాణా రాష్ట్ర అధ్యక్షురాలు కట్ల భాగ్యలక్ష్మి నుండి నియామక పత్రం అందినట్లు విలేకరులకు తెలిపారు. నిరంతర సాహితీ కార్యక్రమాల విస్తరణలో భాగంగా ఈ కమిటీ నియామకం జరిగినట్లు తెలిపారు. ఎన్నో కవితలు, వ్యాసాలూ రాస్తున్నారు. శ్రీ శ్రీ కళావేదికలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.