గజ్వేల్ ఇంజనీర్స్ సదస్సులో లెక్చరర్ గా మారిన పంచాయతీ రాజ్ ఇంజనీర్-ఇన్- చీఫ్

Published: Thursday December 02, 2021
హైదరాబాద్ 01 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి: గజ్వెల్ లోని సంయుక్త కార్యాలయ సముదాయం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐఓసీ) సి.బ్లాక్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం అవగాహన సదస్సు‌ను సూపరింటెండెంట్ ఇంజనీర్ వి.కనకరత్నం ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సు కు పంచాయతీ రాజ్ ఇంజనీర్-ఇన్-చీఫ్. ఎ.జి.సంజీవరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. హైదరాబాద్ నాణ్యత పర్యవేక్షణ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంమోహన్ రావు, సంగారెడ్డి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ తుమ్మలపల్లి జగదీశ్వర్, ఆందోల్ పంచాయతీ రాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజయ్య తాల్క హాజరయ్యారు. మెదక్ రీజియన్ పరిధిలోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, టెక్నికల్ ఆఫీసర్స్, కాంట్రాక్టర్లు ఏజెన్సీలు తదితరులు సదస్సుకు హాజరైనారు. మొదట ముఖ్య అతిథి ఏ.జి.సంజీవరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి ముఖ్య అతిథి మాట్లాడుతూ... పని పూర్తి అయిన తరువాత నాణ్యత పర్యవేక్షణ అధికారులు వచ్చి రోడ్డును చేసిన పనిని  పగులకొట్టి పరీక్షలు జరపకుండా... పని జరుగుతున్న సమయంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఇంజనీర్స్ కు కాంట్రాక్టర్లకు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. పోస్ట్ మార్టం పద్ధతిని అనుసరించ వద్దని సలహా ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అయిన రైతు వేదికలు, వైకుంఠ ధామాలు పూర్తిచేసి నందుకు ఫీల్డ్ ఇంజనీర్స్ ను అభినందించారు. వైకుంఠ ధామాల పథకం ఇతర రాష్ట్రాలలో లేదని ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచనా విధానం తో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్లు మరియు వారి వద్ద పనిచేసే సూపర్ వైజర్సై కు ఇంజనీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం మంచిదని సూచించారు. అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించిన మేస్త్రీ తో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సదస్సులు తరచూ నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. వివిధ రకాల ప్రాబ్లమ్స్ ను ఏవిధంగా నివారించ గలమో అని అనేక ఉదాహరణలతో వివరించండం జరిగింది. రోడ్డు మూల మలుపు వద్ద రోడ్డు నిర్మాణం ఏవిధంగా ఉండాలి సూపర్ ఎలివేషన్ ను ఏవిధంగా డిజైన్ చేయాలో బోర్డు పైన ఉదాహరణలతో సహా కళాశాల లెక్చరర్ లాగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్ రావు ప్రొజెక్టర్ ద్వారా నాణ్యత పర్యవేక్షణ నియంత్రణ పద్ధతులను కూలంకషంగా వివరించారు. తదుపరి సూపరింటెండింగ్ ఇంజనీర్ వి.కనకరత్నం ఆద్వర్యంలో ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు ఇంజనీర్స్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వర్క్ షాప్ లు చాలా ఉపయోగకరంగా ఉంటుందని జరుగుతుందని పంచాయతీ రాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వి.కనకరత్నం అభిప్రాయపడ్డారు. ఇలాంటి  మంచి అవకాశం అని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు