సి.పి ఎస్ ను రద్దు చేయాలి : టిపిటిఎఫ్ పోరెడ్డి దామోదర్ రెడ్డి డిమాండ్.

Published: Friday April 29, 2022
కరీంనగర్, ఏప్రిల్ 28 ప్రజాపాలన క్రైం : రాష్ట ప్రభుత్వo 2004. సెప్టెబరు 1 నుండి అమలు చేస్తున్న సి.పి.ఎస్ పెన్షన్ స్కీమ్ ను పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని టీపీటీఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పోరెడ్డి దామోదర్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాని డిమాండ్ చేశారు.  ఉపాధ్యాయ సంఘంగా మా నాయకులు, ఉపాధ్యాయలు సి.పి.ఎస్ ను రద్దు చేయాలని కోరుతూ యేండ్ల తరబడి ఉద్యమం చేస్తుంటే అంతకంటే అమానవీయ పరిస్తితులను సృష్టించారు. ఒక అడుగు ముందుకు వేసినట్లు ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రకటించారు. కానీ దినవల్ల కేవలం 2 శాతం మందికి మాత్రమే ప్రయోజనం కలుగుతుంది. 80 శాతం ఉద్యోగ ఉపాధ్యాయలకు అనాయ్యం జరుగుతుంది అని వేరు తెలిపారు. పక్క రాష్ట లు సి.పి.ఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రo కూడా ఉపాధ్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రద్దు చేయాలని వీరు డిమాండ్ చేశారు. అలాగే దేశానికి వెన్నుముకగా ఉన్న ఉపాధ్యాయలు. రైతులను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు నిరంకుశ వైఖరిని అవలబిస్తు వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు అని అన్నారు. రాష్ట ప్రభుత్వం వెంటనే విద్య రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని. అర్హత కలిగిన ఉపాధ్యాయలకు పదోన్నతులు, మరియు బదిలీలు జరుపాలని, వాటిని జూన్ మాసం లోగా పూర్తి చేయాలని, 317.జివో ద్వారా ఏర్పడిన బార్య బర్త ల,బదిలీలు, ఒంటరి మహిళాల అప్పీల్ ను. మ్యుచివెల్ అప్పీల్లను సర్వీసును సర్వీసు నష్టపోకుండా వారికి నాయ్యం చేయాలని, ఎందుకంటే ప్రభుత్వం అన్ని విధాలా సర్వీస్ కు భద్రత కల్పిస్తాం అని ప్రకటన చేసిన దరిమిలా వేలాది మంది ఉపాధ్యాయలు మ్యుచువల్ బదిలీలు పెట్టుకొన్నారని విరు తెలిపారు. కావున పరస్పర బదిలీలను. ముందుగా పరిష్కారం చేయవలసిన అవసరం ప్రభుత్వ నిదే అని వెంటనే విద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేశారు. పదవతరగతి పరీక్షలు మే 23 నుండి జరుగుతున్న నేపథ్యంలో పరీక్షల డ్యూటీ లో ఉన్న ప్రతి ఒక్కరికీ 24 ఏర్నెడ్ లీవులను మంజూరు చేయాలని వీరు డిమాండ్ చేశారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద తగిన సదుపాయాలు వసతులు కల్పించాలని అని విరు కోరారు.