నేటి బాలలే రేపటి పౌరులు :సర్పంచ్ దయామణి

Published: Friday June 17, 2022

బోనకల్, జూన్ 16 ప్రజా పాలన ప్రతినిధి : నేటి బాలలే రేపటి పౌరులు అని బాల్యవివాహాలను అరికట్టి బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా తన తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు 21 సంవత్సరాల లోపు మగపిల్లలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని సర్పంచ్ యంగల దయామణి అన్నారు. గురువారం మండలంలోని కలకోట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ చట్టాలు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఐసీడీసీ సూపర్వైజర్ బీ జాన్ బీ మాట్లాడుతూ బాలల అవసరాలను గుర్తెరిగి వారి సంక్షేమం కోసం కృషి చేయాలని బాల్యవివాహాలను అరికట్టాలని, బాలకార్మిక వ్యవస్థ నిషేధం విధించాలని ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి మనోవికాసం కలిగించాలని, ఇందుకోసం ప్రభుత్వం నిర్దేశించిన విధంగా గ్రామ స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని గుర్తు చేశారు, ఈ సందర్భంగా గ్రామ వైద్యాధికారి ప్రశాంత్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది అని అన్నారు. సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామ కమిటీలు బాలల సంరక్షణ కు తోడ్పాటును అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యంగల దయామణి, ఉప సర్పంచి చావా హరిత, ఎంపీటీసీ మార్తమ్మ , కార్యదర్శి నాగేశ్వరరావు ,వైద్యాధికారి ప్రశాంత్, ఐ సి డి ఎస్ సూపెర్వైజర్ బీజాన్ బీ, ఎన్ జి ఓ సౌజన్య,ఏ ఎన్ ఏం విజయరత్నం, అంగన్వాడిలు యాకుబీ, ప్రసాదభాయి ,వి ప్రసాద్ భాయి, నాగమణి ఎస్ ఏం సి చైర్మన్ రత్నాకర్, ఆశాలు విజయ ఎమ్మెల్యేమ్మా తదితరులు పాల్గొన్నారు.