రోడ్లపై మేకలు కట్టేయరాదు

Published: Saturday October 09, 2021
పీలారం సర్పంచ్ కొంపల్లి భారతమ్మ నర్సిములు
వికారాబాద్ బ్యూరో 08 అక్టోబర్ ప్రజాపాలన : రోడ్లపై మేకలు కట్టేయడంతో దుర్గంధభరిత వాసన వస్తుందని పీలారం గ్రామ సర్పంచ్ కొంపల్లి భారతమ్మ నర్సిములు హితవు పలికారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని పీలారం గ్రామంలో ఉప సర్పంచ్ షకీల్ పాష, వార్డు మెంబర్లతో కలిసి ఊరంతా తిరిగి పరిశీలించారు. రోడ్లపై మేకలు కట్టేసిన వారికి జిపి నుండి నోటీసులు పంపినా స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేకల మలమూత్రాల దుర్వాసనతో చుట్టుపక్కల ఇండ్లలో నివసించే వారు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మేకలను పొలంలో కట్టేయడానికి ప్రభుత్వం మేకల షేడ్ నిర్మాణానికి 50 వేల రూపాయలు మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. 5వ వార్డు మెంబర్ కెరెల్లి గీత సంజీవ్ ఇంటి దగ్గర మోరీ నిర్మాణం లేక మురికి నీరంతా రోడ్డుపై ప్రవహిస్తుందని వార్డు ప్రజలు గగ్గోలు పెట్టారు. మొల్ల సాబేరాబేగమ్ ఇంటి పునాది గోడల్లోకి మురికి నీరు చేరి శిథిలావస్థకు చేరుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధ నర్సిములు, చాన్ పాష వాళ్ళ మేకలు రోడ్డుపై మేకలు కట్టేసి దుర్గంధం చేస్తున్నారని విమర్శించారు. తెలుగు అనంతయ్య ఇంటి నుండి మంగలి పెంటయ్య ఇంటి వరకు మోరీ నిర్మాణం చేపట్టవలసి ఉందని స్పష్టం చేశారు. పిట్టల బలరాం, పిట్టల గోపాల్ ల చిన్నారులు మరుగు దొడ్డిని వినియోగించకుండా మంగలి పెంటయ్య ఇంటి వెనుక భాగంలో బహిర్భూమికి వెళ్ళడంతో దుర్గంధ భరిత వాసన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు కొంపల్లి నర్సిములు, వార్డు మెంబర్లు చంద్రమ్మ, కెరెల్లి గీత, మంగలి మల్లయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.