మీర్ పేట్ పోలీస్ లు అశ్వదళాలతో పరిశీలన

Published: Wednesday May 26, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజలందరూ పోలీస్ సిబ్బందికి సహకరించాలని మీర్ పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి కోరారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాక్ డౌన్ లో భాగంగా సోమవారం నాడు మీర్ పేట్ పోలీస్ వారి ఆధ్వర్యంలో, మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు అశ్వ దళాలతో వివిధ కాలనీలో ప్రదర్శన చేయడం జరిగింది, పీస్ పరిధిలోని బాలాపూర్ x రోడ్, బాలాపూర్ మార్కెట్, రైతు బజార్, మీర్ పేట్ x రోడ్, మీర్ పేట్ బురజు, లలిత నగర్ x రోడ్ లాంటి ప్రాంతాలలో, మీర్ పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, డిటేక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ ఐ వెంకటరెడ్డి, ఎస్ ఐ మారయ్య ,అశ్వదాలాలపై తిరుగుతూ లొక్డౌన్ పరిస్థితులను గమనించారు, ఈ సందర్బంగా మీర్ పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..... రాచకొండ సీపీ ఆదేశాల మేరకు  ప్రజలు వాళ్ళ ఇంట్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రాకూడదని, అలాగే లాక్ డౌన్ వెసులు బాటు సమయంలో కూడా భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసరా వస్తువులు కొనుక్కోవాలని, ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా ఎవరు బయటికి వొచ్చిన, వాహనాలపై ఇచ్చిన వాహనాలు సీజ్ చేయబడుతాయని అన్నారు. ప్రజలు అందరూ పోలీస్ సిబ్బందికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం లో మీర్ పేట్ పీస్ సబ్ ఇన్స్పెక్టర్ లు మారయ్య, ఉదయభాస్కర్, వెంకట్ రెడ్డి లు పోలీస్ సిబ్బంది, అశ్వద్ధామ సిబ్బంది పాల్గొన్నారు.