భరత్ విద్యాసంస్థలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Published: Thursday March 09, 2023

 మధిర, మార్చి 8 ప్రజా పాలన ప్రతినిధి: పట్టణంలోని భరత్ విద్యాసంస్థలలో బుధవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యాసంస్థల కరస్పాండెంట్,మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విద్యాలత వెంకటరెడ్డి హాజరయ్యారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన డిబేట్ పోటీలలోని విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ప్రత్యేక బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శీలం విద్యాలత వెంకటరెడ్డి మాట్లాడుతూ.... ప్రస్తుతం సమాజంలో మహిళలు అనేక రంగాలలో ముందుకు పోతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ ఈ పోటీ ప్రపంచంలో ముందుకు సాగుతూ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జింకల కోటేశ్వరరావు,రవీందర్ రెడ్డి,భవాని,త్రివేణి, ప్రియాంక,స్రవంతి,ఉమా,రమ్య,పద్మ,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.