ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి **ఆనారోగ్యంతో మృతి చెందిన శంకరయ్య కుటుంబాని

Published: Thursday April 13, 2023
ఇబ్రహీంపట్నం మండలం పెత్తుల్ల గ్రామంలో దార శంకరయ్య  అనారోగ్యంతో మృతి చెందడంతో బీద కుటుంబం కావడంతో ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కుటుంబానికి 6000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ మాట్లాడుతూ గ్రామంలో ఎవరికి ఆపద ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని ముందు ముందు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీగా అనేక కుటుంబాలను ఆదుకున్నామని ముందు ముందు పేదలకు ఏ ఆపద వచ్చిన కాంగ్రెస్ పార్టీగా మేము ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరు రమేష్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కోడూరు పాండు యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు దాచేపల్లి సాయి, ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పంబలి జంగయ్య దార నరసింంహ, బోడ తేజ, పంబలి పాండు కోరి నరసింంహ,  పంబలి ప్రవీణ్, ఆధార్ల ధోని దార శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.