ఎన్నికల పోలింగ్ పకడ్బంధీగా నిర్వహించాలి.

Published: Thursday December 09, 2021
మంచిర్యాల బ్యూరో‌, డిసెంబర్ 8, ప్రజాపాలన : స్థానిక సంస్థల, శాసన మండలి సభ్యుల ఎన్నికల పోలింగ్ పకడ్బంధీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా॥ శశాంక్ గోయల్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో ఈ నెల 10న జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణ పకడ్భంధీగా, నిస్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఈ నెల 10న ఉదయం 8 గం||ల గంటల నుండి సాయంత్రం 4 గం||ల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.