కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్సీపి ధర్నా ..రేషన్ బియ్యం అక్రమ దందా ను ఆరికట్టాలని డిమాండ్.

Published: Tuesday October 11, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 10, ప్రజాపాలన: 
 

రేషన్ బియ్యం  అక్రమ దందా ను ఆరికట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.అనంతరం జాయింట్ కలెక్టర్  మధుసూదన్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జుమ్మిడి గోపాల్  మాట్లాడుతూ కోటపల్లి మండలంలోని జాతీయ రహదారి ఎన్ హెచ్ 63 పైన రోజుకూ కొన్నిటన్నుల రేషన్  బియ్యం పక్కదారి పడుతోందని ఇదే విషయం పైన చాలా సార్లు రెవెన్యూ సిబ్బంది కి, విజిలెన్స్ సిబ్బందికి విన్నవించినా మండల,జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని,కోటపల్లి మండల సరిహద్దు లో మహారాష్ట్రలోని సిరొంచ ఉంది, అక్కడి దళారుల   తో కోటపల్లి మండల అధికారులు చేతులు కలిపి  అక్రమ రేషన్ బియ్యం దందా కు పాల్పడుతున్నారు అని అన్నారు.ఇట్టి అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని, అక్రమ రేషన్ బియ్యం  దందా ను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.ఈ  కార్యక్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర నాయకులు బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మద్దెల శ్రీనివాస్, ప్రగతిశీల యూత్ లీడర్ జిల్లా కార్యదర్శి బెక్కం కాంతయ్య, యూత్ కార్యదర్శి వెంగల శ్రీనివాస్, వాసుమల్ల క్రాంతి, నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్రెస్ జిల్లా ఇంచార్జ్ జాడి నరేందర్,ఇఫ్ట్ జిల్లా నాయకులు లక్షన్, తదితరులు పాల్గొన్నారు..