రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం

Published: Monday April 10, 2023
వికారాబాద్ బ్యూరో 09 ఏప్రిల్ ప్రజాపాలన : 
5 వేల కోట్లతో చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, ప్రతీ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రెడ్డి ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు.ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్య భారతి ఫంక్షన్ హాల్ లో రెడ్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించగా రెడ్డి బంధువులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పిట్ట శ్రీనివాస్ రెడ్డి,పలువురు ప్రముఖులు  మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రెడ్లకు,వైశ్యులకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులను, అధికారులను కలిసి విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కార్పొరేషన్‌ను సాధించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.