తెలంగాణ జోన్ల పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం తెలపాలి

Published: Thursday March 18, 2021
చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజీత్ రెడ్డి 
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 17 ( ప్రజాపాలన ) : వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుండి చార్మినార్ జోన్ లోకి మార్చాలని పార్లమెంట్ సమావేశాలలో సభాపతి మీనాక్షి లేఖికి బుధవారం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ జోన్ల పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలకు ఆమోదం తెలపండి అని కోరుతూ లోక్ సభలో రూల్ 377 కింద ప్రత్యేకంగా ప్రస్తావించారు మెరుగైన పాలన అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నూతన జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. అలాగే ప్రస్తుతం జోగులాంబ జోన్- 7 కింద ఉన్న వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్- 6కు చేర్చాలని కోరారు. ఈ రెండు ప్రతిపాదనలు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్ లో ఉండడంతో జోనల్, మల్టీ జోనల్, జిల్లా క్యాడర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయలేకపోతోంద ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం‌ అలసత్వం కారణంగా తెలంగాణ యువతలో ఆగ్రహం, ఉద్రిక్తత, అశాంతిని కలుగజేస్తున్నాయని ఎంపీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనలకు సంబంధించి కేంద్ర ఆమోదం తెలిపే అంశంలో తాజాగా హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన మరోసారి లోక్ సభలో గుర్తు చేశారు. గత రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణల చేసి, ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మార్గం సుమగం చేయాలని విన్నవించారు.