ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత మీదే.. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా క

Published: Friday December 30, 2022
 పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు 
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం వాసవి నగర్ గిరిజన భవన్ నందు పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతస్థాయి సమావేశం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు నియోజవర్గ  పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో ప్రత్యేక సమావేశమై పార్టీ చేపట్టే కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు, భారీ గజమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
 పార్టీ సోషల్ మీడియా వారియర్స్, పార్టీని మరింత అభివృద్ధి చేయడానికి సైనికుల్లా కష్టపడాలని కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుందని ఆయన అన్నారు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు, సంక్షేమ పథకాలను గడపగడపకు చేర్చాలన్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేదు అందుకు సోషల్ మీడియా వారియర్స్ విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వేదికగా ప్రజలను చైతన్యపరచాలన్నారు, రానున్న ఎన్నికలలో  గెలుపే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించాలన్నారు, ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు, సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో  పార్టీ సోషల్ మీడియా వారి తీవ్రంగా కృషి చేయాలని కొనియాడారు, సోషల్ మీడియాలో ఏ పార్టీకి లేనంతగా స్వచ్ఛంద సైనికులు ఉన్నారని ఆయన అన్నారు, ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసేందుకు సోషల్ మీడియా నిరంతరం కృషి చేస్తుందని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు చేరేలా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చురుగ్గా పనిచేసే ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే విధంగా ఉండాలని సూచించారు, పినపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు, సీఎం కేసీఆర్  వచ్చాక ఆసరా పెన్షన్ నిరంతర ఉచిత విద్యుత్, ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామన్నారు, తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న ప్రభుత్వమని ఆయన తెలిపారు, దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు,  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు, రైతుల సంక్షేమం కోసం అందజేస్తున్న రైతుబంధు రైతు బీమా 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని వారు సోషల్ మీడియా వారియర్స్ కు సూచించారు, పేదింటి ఆడబిడ్డల పెళ్ళికి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.1,00,116, ఆర్థిక సాయం అందజేస్తున్నదన్నారు,
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రత్యేక టీం సభ్యులు, మణుగూరు బిఆర్ఎస్  పార్టీ టౌన్ సోషల్ మీడియా అధ్యక్షులు మారోజు రమేష్, పార్టీ మండల సోషల్ మీడియా అధ్యక్షులు కాట్రగడ్డ సురేంద్ర పటేల్, పినపాక మండల సోషల్ మీడియా అధ్యక్షులు శ్యామల సతీష్, అశ్వాపురం మండలం సోషల్ మీడియా అధ్యక్షులు మల్లబోయిన ప్రశాంత్ యాదవ్, బూర్గంపాడు మండల సోషల్ మీడియా అధ్యక్షులు గంగాపూరి చంద్రశేఖర్, కరకగూడెం సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టి మల్ల ప్రవీణ్, ఆళ్లపల్లి మండల  సోషల్ మీడియా అధ్యక్షులు కంచర్ల సందీప్, సోషల్ మీడియా సభ్యులు ఎండి ఆదామ్, నజీర్ సోను, మోదుగు వంశీ, పాపాల వీరబాబు, సందీప్ యాదవ్, తాళ్లపల్లి నాగరాజు, శివశంకర్, బోయిళ్ళ రాజు, ప్రవీణ్, రామకృష్ణ, పద్మారావు, శ్రీకాంత్, క్లాసిక్ రాము, చిరంజీవి,గుగులోత్ రవి,వల్లెపోగు రాము,పుస సంతోష్, గుగులోత్ రాంబాబు నాయక్, మహేష్, రామకృష్ణ, నిట్ట ప్రభాకర్, మంగళగిరి రామకృష్ణ, సాంబ, చిట్టి మల్ల శ్రీను, చీకటి రఘు, సోషల్ మీడియా వారియర్స్ పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు...