శుభోదయం ని తలపించే విధంగా మన్మరి

Published: Friday November 25, 2022

గ్రామంలో సర్పంచ్ సుహాసిని సత్యనారాయణ డిప్యూటీ సర్పంచ్ గోపాల్ ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులు యువకులు గ్రామ పెద్దలు వీధి వీధి తిరిగి సమస్యలు తెలుసుకున్నారు అదేవిధంగా అక్రమ కట్టడాలను తీసివేయాలని కోరారు గ్రామంలోని మురుగునీరు మిషన్ భగీరథ లీకేజీలు సీసీ కెమెరాలు పనితీరును  వీధుల్లో ఎక్కడైనా చెత్తాచెదారం పేరుకుపోయిందా గమనించారు వీధుల్లో చెత్తను పాడేయరాదని తెలియజేశారు అదేవిధంగా గ్రామంలో చిన్న వ్యాపారాల నిమిత్తం బైకులపై వచ్చి వస్తువులను అమ్మే వాళ్లను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలని అన్నారు ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన ఆధారం ఫోటో సతీష్ ఇంట్లో సతీష్ కొడుకు గౌతమ్ ఒక్కడు ఉండటం గమనించిన ఆ వ్యాపారస్తుడు గౌతమ్ ను భయపెట్టించి తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ జేబులో ఉన్న నగదును తీసుకోవడం జరిగింది గౌతమ్ భయంతో ఎవరికి చెప్పకుండా ఇంట్లో గడియ పెట్టుకొని ఉన్నాడు అదే అదునుగా భావించిన వ్యాపారస్తులు సెల్ ఫోన్ నగదుతో పరారయ్యాడు విషయం తెలుసుకున్న సతీష్ సిఐ గురువయ్య గౌడ్ కు ఫిర్యాదు చేయగా సిసి ఫుటేజ్ పరిశీలించి దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు * *కనుక మిట్ట మధ్యాహ్నం అందరూ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే సమయంలో వచ్చే వ్యాపారస్తులను మందలించాలని అన్నారు*