షాపు యజమానులు ఫేక్ కాల్స్ ను నమ్మి మోసపోవద్దు

Published: Wednesday July 28, 2021
- ఛైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 27 జూలై ప్రజాపాలన : గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ షాప్ ట్రేడింగ్ లైసెన్స్ బ్యాలెన్స్ ను రెన్యూవల్ చేస్తామని కాల్ చేస్తే స్పందించరాదని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్  హెచ్చరించారు. మంగళవారం ఉదయం నుంచి వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని షాపుల యజమానులకు గుర్తు తెలియని వ్యక్తి వాయిస్ రికార్డుతో షాపు యజమానులను జాగృతపరిచారు. రెన్యూవల్ చేస్తాం వెంటనే డబ్బులు గూగుల్ పే చేయాలంటూ ఫేక్ కాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం నుండి అధికారులు ఎవరు కూడా అలా ఫోన్ చేసి డబ్బులు గూగుల్ పే చేయమని చెప్పమని అన్నారు. ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్స్ వస్తే మోసపోకుండా మున్సిపల్ కార్యాలయం ఫోన్ నెంబర్ : 9701969798 ను సంప్రదించగలరని కోరారు. ఇట్టి ఫేక్ కాల్స్ విషయమై వికారాబాద్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వబడిందని వివరించారు.