కోటగిరి రంగారావు వర్ధంతి వేడుకలు..

Published: Saturday September 17, 2022

 తల్లాడ, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన న్యూస్): తల్లాడలో బాలభారతి విద్యాసంస్థల వ్యవస్థాపకులు స్వర్గీయ కోటగిరి రంగారావు 11వ వర్ధంతి వేడుకలను శుక్రవారం స్థానిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులను పంపిణీ చేశారు.  విద్యాసంస్థల కరస్పాండెంట్ కోటగిరి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. తొలుత రంగారావు చిత్రపటానికి ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు పూలమాలవేసి నివాళుల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.