ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. మణుగూరు 100 పడకల ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్న

Published: Wednesday November 23, 2022
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు వరం. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దానిలో భాగంగానే ఈరోజు 
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు తో పాటు జిల్లా కలెక్టర్ అనుదీప్  దురిశెట్టి తో కలిసి మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సాదించారన్నారు. జిల్లా కలెక్టర్ మణుగూరు స్పెషల్ ఆఫీసర్ గా దొరకడం నిజంగా ప్రజల  అదృష్టం అన్నారు. గ్రామాల్లోని పి హెచ్ సి లలో కూడా సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు. అతి త్వరలోనే డయాలసిస్ సెంటర్ ను కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వైద్య సేవల్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పిటిసి పోషం నరసింహారావు డాక్టర్లు తదితరులు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.