వాకింగ్ ట్రాక్ కోసం ఎమ్మెల్యేకు వాకర్స్ అసోసియేషన్ వినతిపత్రం...

Published: Thursday July 22, 2021
జగిత్యాల, జులై 21 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని ఎస్కెఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాకింగ్ ట్రాక్ మరియు ఐమస్ లైట్లను ఏర్పాటు చేయాలని ఎస్కెఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాల ఆవరణలో విద్యార్థులు వాకర్స్ సౌకర్యార్థం ఐమస్ లైట్స్ వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు తప్పకుండా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే కళాశాల వద్ద ఓపెన్ జిమ్ పబ్లిక్ టాయిలెట్స్ వంటి సౌకర్యాలను కల్పించడం జరిగిందని అన్నారు. అలాగే జులై 24న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టనున్న ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తోట మల్లికార్జున్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నర్సయ్య పరందాములు ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.