విద్యార్థులకు ఎల్ ఈ డి టీవీ లు అందజేయట

Published: Monday September 13, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : మెరుగైన డిజిటల్ విద్య పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి ఎల్ఈడి టీవీలు అవసరమని  టీ ఎస్ ఎం టి చార్టెడ్ అకౌంటెంట్స్ సీతా రవి ప్రకాష్ అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో పాస్ కాలనీలొ ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు టి ఎస్ ఎం టి చార్టెడ్ అకౌంటెన్సీ బేగంపేటకు చెందిన సీతా రవి ప్రకాష్ సొంత ఖర్చులతో ఎల్ఈడి టీవీ లతోపాటు విద్యార్థులకు పెన్నులు, పెన్సిలు, బుక్కులు, అందజేశారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని ఉద్దేశంతో ఎల్ ఈ డి టీవీలు అందించిన దాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపి, వారికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ, శ్రీ లయన్ వేణు మాధవ్, హేమంత్, ప్రశాంత్, అభినవ్, సూదీప్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.