కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు శంకరపట్నం డిసెంబర్ 22 ప్రజాపా

Published: Friday December 23, 2022
వీణవంక మండలం బ్రాహ్మణులపల్లి గ్రామానికి చెందిన బొచ్చు సంపత్  ఈనెల 14వ తేదీన అదే గ్రామానికీ చెందినా మండల గట్టయ్య,మండల చంద్రమౌళి లా భూ వివాదం పంచాయతీ విషయమై కేశవపట్నం పోలీస్ స్టేషన్ వద్దకు రాగా యాదవ కులానికి చెందిన మండల గట్టయ్య,మాదిగ కులస్తుడైన బొచ్చు సంపత్ ను కులం పేరుతో దూషిస్తూ తన పాదరక్షతో కొట్టడానికి రావడంతో పక్కనే ఉన్న పంచాయతీ పెద్ద మనుషులు మండల సంపత్ , మండల నాగరాజులు  ఆపారు. అయితే ఆత్మ న్యూనత చెందిన బొచ్చు సంపత్ గురువారం కేశపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా  ఎస్సై చంద్రశేఖర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు