పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ క్రికెట్ కిట్ల పంపిణీ

Published: Wednesday March 03, 2021

జన్నారం, మార్చి 2, ప్రజా పాలన: మండలంలోని అలీ నగర్ గ్రామంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో క్రికెట్ కిట్స్, వాలీబాల్ కిట్లు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని ఎస్ ఐ మధుసూదన్ రావు తెలిపారు. సి పి సత్యనారాయణ ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి శరత్ చంద్ర పవర్ ఇద్దరూ ట్రైని  ఐపీఎస్లు  సి ఐ నారాయణ నాయక్ పాల్గొన్నట్లు  ఎస్ ఐ తెలిపారు.