తడి పొడి మరియు హానికరమైన చెత్తలను వేరు చేయుట గురించి అవగాహన కల్పించిన మున్సిపల్ మేనేజర్

Published: Saturday December 11, 2021
మధిర డిసెంబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి : మధిర పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డులో స్వచ్ఛ సర్వెక్షన్ లో భాగంగా తడిచెత్త, పొడిచెత్త మరియు హానికరమైన చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అంధించాలని మునిసిపల్ మేనేజర్ శ్రీ పి. రవీంద్ర కుమార్ కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ గారు మాట్లాడుతూ మన మధిర టౌన్ స్వచ్ఛ సర్వేక్షన్ లో మంచి ర్యాంక్ సాధించాలంటే పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని కోరారుమన ఇండ్లలో ప్రతిరోజు ఉత్పన్నం అయ్యే చెత్తను తడి చెత్త అనగా మిగిలిన అన్నం, పండ్లు, కూరగాయల తొక్కలు చెట్ల నుండి రాలిన ఆకులు, పూలు లాంటి మనవునిచే సృష్టించబడని చెత్తను తడి చెత్తగా ఆకుపచ్చ రంగుగ్రీన్ కలర్ డబ్బా లో భద్ర పర్చుకొని స్వచ్ఛ ఆటోలకు అందించాలని, అలాగే పేపర్, ప్లాస్టిక్ కవర్లు, బాటిల్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల చెత్త లాంటి మానవుని చే సృష్టించబడిన చెత్తను పొడి చెత్తగా నీలం రంగుబ్లూ కలర్డబ్బాలో భద్రపర్చి స్వచ్ఛ ఆటోలకు అందించాలని మరియు మెడికల్ వేస్టేజ్ అనగా వాడగా మిగిలిన టాబ్లెట్స్, టానిక్ లు, చిన్న పిల్లలకు ఉపయోగించే నాప్కిన్ లు,గాజు ముక్కలు,సూదులు లాంటి వాటిని హానికరమైన చెత్తగా ఎరుపురంగురెడ్ కలర్డబ్బాలో వేసుకొని స్వచ్ఛ ఆటోలకు అందించాలని సూచించారుఇలా సేకరించిన తడి చెత్త నుండి ఎరువు ను తయారు చేసి మొక్కలకు వేయడం, పొడి చెత్తను రీ సైక్లింగ్ చేసి పునర్వినియోగించేలా చేయడం మరియు హానికరమైన చెత్తను భూమిలో పాతి పెట్టడం వలన డంపింగ్ యార్డు లో 95 శాతం చెత్త పెరుకుపోకుండా చేయవచ్చని తద్వారా పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు.పట్టణ ప్రజలకు అవగాహన నిమిత్తం వారం రోజుల పాటు అన్ని వార్డులలో ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తామని వారం తదుపరి ఎవరైతే చెత్తను వేరు చేసి ఇస్తారో వారి నుండి మాత్రమే చెత్తను స్వచ్ఛ ఆటోలలో వేసుకుంటారని, ఎవరైతే చెత్తను కలిపి అలాగే తీసుకువచ్చే వారినుండి చెత్తను తీసుకోబోమని, అట్టి చెత్తను బయట పారవేస్తే వారికి జరిమా విధిస్తామని తెలిపారు కార్యక్రమంలో మునిసిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సైదా నాయక్, మున్సిపల్ సిబ్బంది తిరుపతి రావు, వేణు గోపాల్, దిలీప్, వార్డు మహిళలు మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు