బీసీ బిల్లు పై బీసీ ఎంపీలు పార్లమెంట్లో నిలదీయాలి. ....బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గు

Published: Tuesday December 20, 2022
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్19, ప్రదాపాలన:
 
బీసీ బిల్లు పై బీసీ ఎంపీలు పార్లమెంట్లో నిలదీయాలని బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని
బెల్లంపల్లి చౌరస్తా ప్రాంతంలో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో  పాల్గొని మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే విధంగా బీసీ ఎంపీలు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని అన్నారు. పార్లమెంటులో ప్రస్తుతం 90 మంది బీసీలు ఎంపీలుగా కొనసాగుతున్నారని , బీసీ బిల్లు పై పార్లమెంటులో ప్రస్తావించకుంటే బీసీ ఎంపీలను ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. అనేక సంవత్సరాలుగా బీసీలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమాలు నడుస్తుంటే బీసీలుగా పార్లమెంటులో ప్రతినిత్యం వహిస్తున్న ఎంపీలు బీసీ బిల్లు పై ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం బాధాకరం. అన్్నా్రు.  దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీల ఆకాంక్షను పార్లమెంటులో వినిపించాలని కోరుతున్నాం, అదేవిధంగా 1931లో బ్రిటిష్ ప్రభుత్వం బీసీ జనగనణ చేపడితే దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న బీసీ జనగనణపై గతంలో ఉన్న ప్రభుత్వాలు బీసీ జనగణపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయన్నారు.
 ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక , నాయకులు లక్ష్మణ్, ప్రజా సంఘాల జిల్లా కన్వీనర్ జైపాల్ సింగ్, శ్రీపతి రాములు, కల్వ చెర్ల నాగభూషణ,చారి రాస మల్ల కుమార్,మొగిలి రాజేందర్, అశోక్, రాజన్ తదితరులు పాల్గొన్నారు.