పెళ్ళి రోజు సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

Published: Monday May 31, 2021
కేసరి ఫ్యాషన్స్ అధినేత మల్లాపూర్ ప్యాక్స్ డెరైక్టర్ సుతారి రాజేందర్
మల్లాపూర్, మే 30 ప్రజాపాలన ప్రతినిధి : మల్లాపూర్ మండలం పాత దామరాజు పల్లి గ్రామానికి చెందిన కేసరి ఫ్యాషన్స్ అధినేత మల్లాపూర్ ప్యాక్స్ డెరైక్టర్ సుతారి రాజేందర్ - సాహిత్య వివాహా వార్షికోత్సవం పురస్కరించుకొని ఆదివారం మల్లాపూర్  మండల ఎంపీపీ కాటిపెల్లి సరోజన-ఆదిరెడ్డి ఆధ్వర్యంలో కొత్త దామరాజుపల్లి గ్రామానికి చెందిన ఇల్లేందుల రాజేశం నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. గతంలో ఇలాంటి సేవ కార్యక్రమాలు చేసిన సుతారి రాజేందర్ ను స్థానిక ప్రజాప్రతినిధులు, మల్లాపూర్ లయన్స్ క్లబ్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా సుతారి రాజేందర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి ఎల్లవేళలా అండగా నిలుస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల సర్పంచుల పోరం అధ్యక్షులు మైదాసు శ్రీనివాస్, కొత్త దామరాజు పల్లి సర్పంచ్ బద్దం సరిత-కమలాకర్ రెడ్డి, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు ఏలేటి మహేష్, మేము సైతం హెల్పింగ్ సొసైటీ సభ్యులు పేంబి మహేందర్, ఆలిశెట్టి సాయిరాం, ఆలిశెట్టి గంగాధర్, కటిపెల్లి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.