జాతీయతా భావాన్ని పెంపొందించడానికే జాగృతి వార పత్రిక. గజెల్లీ శ్రీదేవి మల్లేశం.

Published: Wednesday November 09, 2022
బెల్లంపల్లి నవంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాగృతి వార పత్రిక ప్రజల్లో జాతీయత భావాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని, స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి గజెల్లీ శ్రీదేవి మల్లేశం అన్నారు.
మంచిర్యాల జిల్లా, తాండూరు మండలం బోయపల్లి వేణు నగర్ లోని స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ జ్యోతి శరణాలయంలో, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు  గజెల్లీ శ్రీదేవి మల్లేశం జాగృతి 75వ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు,
 గత 75 సంవత్సరాలు గా అక్షర యాత్ర చేస్తూ, జనాన్ని జాగృతం చేస్తున్న జాతీయవాద జాగృతి వార పత్రిక జైత్ర యాత్ర కొనసాగిస్తున్నదని,
 ప్రతి ఒక్కరూ తమ బాధ్యత గా గుర్తించి, సమాజానికి ఉన్నంతలో మేలు చేయాలని, ఇలాంటి వారపత్రిక లు చదవడం వలన జాతీయ భావన పెంపొందుతుందని, మనమంతా భారతీయులం, భారతమాతను పూజిద్దాం - దేశగౌరవం నిలబెడదాం అని పేర్కొన్నారు, 
ఈ కార్యక్రమంలో శరణాలయం నిర్వాహకులు శ్రీదేవి, స్వప్న, సేవాజ్యోతి విద్యార్థి సేవా ప్రముఖ్ సత్యకేశవజిత్ సగర, సేవికప్రముఖ్ నాగమణి, లక్ష్మీ, కృష్ణ, శ్యాం, శంకరం, శరణాలయంలో ఉంటున్న మానసిక వికలాంగ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.