పోలీస్ శిక్షణను సద్వినియోగం చేసుకోండి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్

Published: Friday November 04, 2022
బెల్లంపల్లి నవంబర్ 3 ప్రజా పాలన ప్రతినిధి:
 
పోలీసు శిక్షణ కోసం గ్రంథాల సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు దేహదారుడ్య పరీక్షల్లో కూడా పాల్గొనడానికి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు శిక్షణను వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్ తెలిపారు.
 
ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులతో స్థానిక గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు,
 బెల్లంపల్లి శాఖా గ్రంథాలయంలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ పొంది  పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలో అర్హత సాధించిన 45 మంది క్వాలిఫై అయ్యారని,  దేహాదారుడ్య పరీక్ష కొరకు ప్రాక్టీస్ చేసుకునే విధంగా వారికీ సీనియర్లైనా ముగ్గురు వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు ఒక పోలీస్ ఇన్ స్ట్రక్టర్ తో  ప్రాక్టీస్ ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, వారికి  కావాల్సిన పరికరాలు,షూస్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ అవకాశాన్ని క్వాలిఫైడ్ అయిన నిరుద్యోగ యువకులు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 అనంతరం పట్టణం లోని తిలక్ స్టేడియంను  పరిశీలించి పిచ్చిమొక్కలను తొలగించి, స్టేడియంను చదును చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు చాంద్ పాషా, యాదన్ల బలరాం, ఎస్ కే రాజ్ మహమ్మద్, తెరాస నాయకులు ఆవుల సాయిబాబా, డి, రాము తదితరులు పాల్గొన్నారు.