పట్నం ఉన్నత పాఠశాలలో ఘనంగా హిందీ దివస్

Published: Thursday September 15, 2022

 ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 14 ప్రజాపాలన ప్రతినిధి
భారతదేశ ఐక్యతకు ఎంతగానో ఉపయోగపడుతున్న హిందీ పై ఆసక్తిని పెంపొందించుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పొగాకు సురేష్ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం నందు ఘనంగా హిందీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ అని అనేక భాషలలో భిన్నత్వాన్ని కలిగియున్న భారతదేశంలో భాషాపరమైన ఏకత్వాన్ని తీసుకురావడానికి హిందీ దోహదపడిందని వారన్నారు. దేశ అధికార భాషగా ఉన్న హిందీ పట్ల విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కలిగించాలని ఉపాధ్యాయులను కోరారు. హిందీ దివస్ ను పురస్కరించుకుని పాఠశాలల్లో విద్యార్థులకు హిందీ భాషలో వ్యాసరచన, కవితలు, ఉపన్యాస పోటీలను నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులుగా మెడల్స్ ను ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయులు జయశ్రీ, అశోక్, ఉపాధ్యాయులు ఆనంద్,చంద్రశేఖర్, సరిత, శైలజ తదితరులు పాల్గొన్నారు.