ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి *హిందూ దేవతల పైన చేసిన వ్యాఖ్యలను బైరి న

Published: Saturday December 31, 2022

బైరి నరేష్ పైన కరాడి శ్రీలత అనిల్ కుమార్ కౌన్సిలర్ తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ గ ఆధ్వర్యంలో  హిందూ దేవి దేవతల గురించి  అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరాడి శ్రీలత అనిల్ కుమార్ మాట్లాడుతూ హిందూ దేవి దేవతలను అవమానకరమైన రీతిలో లిఖించ లేనటువంటి  వాక్యానాలు చేసినందుకు  వెంటనే బైరి నరేష్ ను అరెస్టు చేయాలి కఠినంగా శిక్షించాలి లేనిపక్షంలో హిందూ శక్తి మొత్తం జాగృతమై పెద్ద ఎత్తున  తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు బచిగల రమేష్ , బిజెపి రాష్ట్ర దళిత మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ కోండ్రు పురుషోత్తం , మధు శ్రీకాంత్ రెడ్డి బిజెపి మున్సిపాలిటీ జనరల్ సెక్రెటరీ, మారగొని సునీత గౌడ్ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు, వడ్డగోని అజయ్ గౌడ్ జనరల్ సెక్రెటరీ ఓబీసీ మోర్చా, పండుగల రాము, రవిచంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది.