ఘనంగా అపరభగీరధుడు జన్మదిన వేడుకలు

Published: Thursday February 18, 2021
రెండో వార్డులో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ... మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత
మధిర, ఫిబ్రవరి17, ప్రజా పాలన: మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డులో కేసీఆర్ జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ఘనంగా నిర్వహించారు. ముందుగా కోటి వృక్షఅర్చనలో భాగంగా ఫైర్ స్టేషన్ ముందు ఖాళీ స్థలంలో మొక్కలు నాటి, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు బాంధవుడు, అపరభగీరథుడు, కారణజన్ముడు, బంగారు తెలంగాణ నిర్మాత.. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు, రైతులకు  సంక్షేమం పథకాలు కొనసాగించాలని భగవంతుని కోరినట్లు తెలిపారు. టిఆర్ఎస్లో టి అంటే ట్రాలీ, ట్రక్కు, ట్యాంకర్ అని పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ శీలం విద్యాలత, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు,మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాస రావు, కార్యదర్శులు అరిగా శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, సయ్యద్ ఇక్బాల్, ఎర్రగుంట లక్ష్మి, దిరావత్ మాధవి, గద్దల మాధురి, మేడికొండ కళ్యాణి, బిక్కి అనిత, కో ఆప్షన్ సభ్యులు కొటారి రాఘవరావు, షేక్ ఖాసిం, మొండితోక జయకర్, ఐలూరు ఉమామహేశ్వర్ రెడ్డి, రేగళ్ళ సాంబశివరావు, శీలం వెంకట రెడ్డి, కనుమూరు వెంకటేశ్వరరావు, తోగారు ఓంకార్, ఎర్రగుంట రమేష్, ముత్తవరపు ప్యారి,ఎస్.డి ఖాదర్, మేడికొండ కిరణ్,విగ్నేశ్వర  ఆలయ చైర్మన్ పుచ్చకాయల సీతారామయ్య, ములకలపల్లి వినయ్ కుమార్, కపిలవాయి జగన్ మోహన్ రావు, టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు భోగ్యం ఇందిరా, శ్రీనివాసరాజు,ఆలయ ధర్మకర్త గుగులోతూ కృష్ణ, ఎంబీసీ మధిర ఇంచార్జ్ కంభం శివకృష్ణ, అబ్బూరి రామన్, మైనార్టీ నాయకులు సయ్యద్ మీరూకాసిం, జె.వి.రెడ్డి, రెండవ వార్డు టిఆర్ఎస్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దెందుకూరు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం. ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు వసంతమ్మ సేవా సధనంలోని మానసికవికాలాంగ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ టీర్ఆఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడి రాష్టం తెచ్చిన నాయకుడు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి గతంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విదంగా సమూలమైన మార్పులు తీసుకువచ్చి దేశానికే దిక్కుసూచి గా వున్నారు అని.కొనియాడారు ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలి అని కోరుకుంటాన్నాం అని తెలియచేసారు ఈ కార్యక్రమంలో దెందుకూరు ఎంపీటీసీ అల్లు రమాదేవి. కొల్లూరి శ్రీను. మాదాల శరత్. గ్రామశాఖ అధ్యక్షుడు అంకబాబు, ఉద్దండు, మాజీ సర్పంచ్ పగడిపల్లి వెంకటేస్వరలు, నెలకుదిటి సత్యనారాయణ, గుర్రం అచ్యుతరావు, పగడిపల్లి రాములు, కందుకూరి నాగబాబు, శ్రీను, మంగముడి వెంకయ్య, రామకృష్ణ, మాధవరావు, కొల్లూరి బాబు, బ్రమ్మయా, తరుణ్, వెంకటప్పయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతున్న సర్పంచ్ మార్తా నరసింహారావు గారు గ్రామ శాఖ నమోదు లక్ష్మణరావు గుమస్తా గోపాలకృష్ణ హెడ్ మాస్టర్ ఆదినారాయణ గారు నాగేశ్వరావు గారు మటూరు గ్రామంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా మొక్కలు నాటిన సర్పంచ్ లీలావతి గారు, ఎంపీటీసీ అడపాల వెంకటేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, మరియు గ్రామ ప్రజలు: కేసీఆర్ జన్మదిన సందర్భంగా వెంకటాపురం గ్రామంలో మొక్కలు నాటుతున్న సర్పంచ్ ధీరావత్ లక్ష్మి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మొక్కలు నాటిన రామాలయం చైర్మన్ దొడ్డ మురళి కమిటీ సభ్యులు ఆవుల రామకృష్ణ మరియు  బాణాల శంకరాచారి: ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి 67వ జన్మదినం సందర్భంగా టి ఎస్ ఆర్ టి సి మధిర డిపో నందు డిపో మేనేజర్ శ్రీ దేవదానం గారి ఆధ్వర్యంలో డిపోలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర డిపో గ్యారేజి ఇంచార్జ్ శ్రీ వి. వెంకటేశ్వర్లు గారు, ఆఫీస్ సిబ్బంది, గ్యారేజి సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొని వంద మొక్కలు నాటడం జరిగినది: ఆత్కూర్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సర్పంచ్ శ్రీ అబ్బూరి సంధ్యారాణి రామకృష్ణ గారు మొక్కలు నాటినారు ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, వార్డ్ మెంబెర్ లాలాసాహెబ్, మీనుగు శంకర్ పాల్గొన్నారు