ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి నిత్యవసర సరుకుల వితరణ

Published: Tuesday April 04, 2023
మధిర, ఏప్రిల్ 3 ప్రజాపాలన ప్రతినిధి: అనుమోల సతీష్ జ్యోత్స్న దంపతుల కుమార్తె చిన్నారి యోషిత పుట్టినరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో మతిస్థిమితం కోల్పోయిన వారికి వృద్ధులకు వికలాంగులకు నిత్యవసర సరుకులను వారి కుటుంబీకులు అందించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న యోషితా కు అభినందనలు తెలియజేస్తూ నిత్యవసర సరుకులను అందించిన సతీష్ జోత్స్న కి ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్ కె కృతజ్ఞతలు తెలియజేశారు.