"పొంగిపొర్లుతున్న తుం పెళ్లి వాగు"

Published: Friday July 23, 2021

వర్షాలు వస్తే 25 గ్రామాలకు అంతరాయం
పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు
ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ మహేష్

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 22 (ప్రజాపాలన) : గత 20, 30 సంవత్సరాల నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు అలుపెరగకుండా కురుస్తున్న వర్షం ప్రభావంతో 20, 30, గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ రేగుంట మహేష్ మాదిగ గురువారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ గత 20, 25, సంవత్సరాల నుండి జిల్లా కేంద్రానికి ప్రక్కనే ఉన్న తుం పెళ్లి గ్రామ సమీపంలోని వాగు బ్రిడ్జి పై నుండి వర్షాకాలం వస్తే అలుపెరగకుండా పారుతుండడంతో ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారని, రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజలకు కనీసం జ్వరం వచ్చినా జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ కు తీసుకు వెళ్ళ లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. జిల్లాలోని అనేక గ్రామాలలో ఇలాంటి చిన్నచిన్న బ్రిడ్జీలు ఉండటంతో వర్షాకాలం వస్తే ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి ప్రజలకు సౌకర్యం కల్పించే విధంగా చూడాలన్నారు. తుం పెళ్లి పక్కన ఉన్న బ్రిడ్జి ని కొత్తగా మంజూరు చేయించి, బ్రిడ్జి నిర్మించాలని గతంలో చాలాసార్లు తెలపడం జరిగింది. బ్రిడ్జి పై నుండి నీరు వెళ్లినా, అధికారులు ప్రజా ప్రతినిధులు చూస్తున్నారు కానీ పట్టించుకోవడం లేదన్నారు. కావున వెంటనే అధికారులు స్పందించి తుం పెళ్లి వాగు బ్రిడ్జి కానీ, జిల్లాలోని ఏ గ్రామాలలో నైనా ఇలాంటి చిన్న చిన్న జడ్జీల సమస్యలు ఉన్నచోట అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.