రాళ్ళచిట్టంపల్లి లబ్దిదారులకు చెక్కుల పంపిణీ

Published: Tuesday January 31, 2023
* సర్పంచ్ ముఫ్లయాస్మిన్ గౌస్
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజాపాలన : సీఎం కేసీఆర్ ఆడపిల్లల పెళ్ళిళ్ళకు కుటుంబ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని రాళ్ళచిట్టంపల్లి గ్రామ సర్పంచ్ ముఫ్ల యాస్మిన్ గౌస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మందు భాగంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గ్రామ సర్పంచ్ మఫ్లయాస్మిన్ గౌస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాళ్ళచిట్టంపల్లి గ్రామ సర్పంచ్ మఫ్లయాస్మిన్ గౌస్ మాట్లాడుతూ ఎన్కతల సువర్ణకు కళ్యాణ లక్ష్మీ,  మొల్ల నస్రీన్, మొల్ల షరీఫాబీ, ముర్తుజా హసీనా బీ, సిరిపురం ఖుద్రత్ బీలకు షాదీముబారక్ చెక్కులను అందజేశామని స్పష్టం చేశారు. లబ్ధిదారులు వచ్చిన డబ్బులను కుటుంబ అవసరాల నిమిత్తం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అతి ముఖ్యమైనదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాళ్ళచిట్టింపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.