టెంట్ హౌస్ షాప్ను ప్రారంభించిన మేయర్

Published: Monday June 07, 2021
బాలపూర్, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : కాలనీవాసులు అందరికీ శుభకార్యములకు సవ్యంగా అందుబాటులో ఉండే సప్లయర్స్ అని అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని బాలాపూర్ గ్రామంలో టెంట్ హౌస్ షాపుని ఆదివారం నాడు కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...... కాలనీవాసులు అందరికీ శుభ కార్యములకు సవ్యంగా అందుబాటులో ఉండే టెంట్ హౌస్ షాపు యజమానులను అద్దె చౌకధరలకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, కాలనీవాసులు టెంట్ హౌస్ షాపు యజమానులు, తదితరులు పాల్గొన్నారు.