బురాన్ ఖాన్ చెరువు సమీపంలోని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మంత్రి

Published: Thursday May 20, 2021
బాలపూర్, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : శాశ్వత ప్రణాళిక ప్రకారంగా బురాన్ ఖాన్ చెరువు కట్టను ఎత్తు, వెడల్పు పెంచి  భవిష్యత్తు లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఉండటానికి అధికారులకు మంత్రి ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బురాన్ ఖాన్ చెరువు మొన్న కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కావడంతో అట్టి ప్రాంతాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారంనాడు సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.... గత సంవత్సరం భారీ వర్షాల కారణాల వల్ల ఆరు మాసాల పాటు బురాన్ ఖాన్ చెరువులోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో బాధాకరంగా ఉందని చెప్పారు. శాశ్వత ప్రణాళిక ప్రకారంగా చెరువు కట్టను ఎత్తు, వెడల్పు గా పెంచి భవిష్యత్తులో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు వరద ముంపునకు గురికాకుండా చూడాల్సిందిగా అధికారులకు మంత్రి ఆదేశించారు. అదే విధంగా డ్రైనేజీ వ్యవస్థ ను పటిష్టం చేయాలని, ఇట్టి చెరువును సుందరీకరణ లో చేర్చాలని అధికారులతో అన్నారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి మున్సిపాలిటీ చైర్మన్, ఇరిగేషన్ అధికారులు, జల్ పల్లి మున్సిపాలిటీ కమిషనర్, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.