ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళిత బందు అవగాహన సదస్సు త్వరలో 2 వేల నుంచి 3000 మందికి అవకాశం : గాం

Published: Monday February 21, 2022
శేరిలింగంపల్లి ప్రజాపాలన న్యూస్ : కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలులో భాగంగా దళిత బంధు పథకం అమలు, కార్యాచరణ, ప్రణాళిక, మార్గదర్శకాలు మరియు విధి విధానాల పై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో జరిగిన మన శేరిలింగంపల్లి నియోజవర్గంలో దళిత బంధు పథకం అమలు లో భాగంగా ఎంపికైన 100 మంది దళిత బంధు లబ్ధిదారులతో నిర్వహించిన దళిత బంధు అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎస్ సి కార్పొరేషన్, ఇండస్ట్రీస్, వెటర్నరీ, మెడికల్, మోటార్ వెహికిల్ అధికారులు, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగరావు తో కలిసి అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గాంధీ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధావుడు అని, దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలు లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపికలో భాగంగా మన శేరిలింగంపల్లి నియోజవర్గంలో దళిత బంధు పథకం అమలులో భాగంగా 100 మంది లబ్ధిదారులతో దళిత బంధు పథకం మార్గదర్శకాలు మరియు విధి విధానాలపై అవగహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది అని, ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలలో ఆర్థిక, సామాజిక అసమానతలు రూపు మాపి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపినవారు అవుతామని, వారి కాలి పై వారు సగర్వంగా తలెత్తుకొని జీవించేలా ఆర్థిక పరిపుష్టి కలిగేలా ఈ పథకం తోడ్పడుతుంది అని, దళిత కుటుంబాల సంక్షేమానికి కట్టుబడిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఈ 100 మంది లబ్ధిదారులు భవిష్యత్తులో మిగతా వారికి ఆదర్శంగా నిలిచేలా ఉండలని, పక్క ప్రణాళిక తో యూనిట్లను నెలకొల్పి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని, ఈ పథకం ను సద్వినియోగ పర్చుకోవలని, లబ్ధిదారులను గుర్తించి వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలిపించే విధంగా సహకరించాలని కొరినారు. అదేవిధంగా వ్యాపార యూనిట్లను వివరించామని ,వారికి నచ్చిన యూనిట్లు నెలకొల్పి ఆర్థిక ,సామాజిక సాధికారికత సాధించాలని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. మార్చి 7వ తేదీ లోగా పూర్తి స్థాయిలో పథకం అమలు పర్చేవిధంగా పథకం అమలు కార్యచరణ, పర్యవేక్షణ ఉండేలా చూడలని పేర్కొన్నారు. దళిత బంధు పథకం అమలులో లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగినది అని అధికారుల సహకారంతో ముందుకు వెళ్లాలని, అధికారులు ఎల్లవేలలో అందుబాటులో ఉంటారని, మార్చి తర్వాత మరో 2000 నుండి 3000 మంది లబ్ధిదారు ల ఎంపిక ఉంటుంది అని, దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు ప్రవీణ్ ఈడి ఎస్ సి కార్పొరేషన్ రంగారెడ్డి, బాలాజీ ఈడీ ఎస్ సి కార్పొరేషన్ మేడ్చల్, రాజేశ్వర్ రెడ్డి జిఎం ఇండస్ట్రియల్ రంగారెడ్డి, ప్రకాష్ రావు అసిస్టెంట్ డైరెక్టర్, లీల ఎడీఈ అగ్రికల్చర్, ఎఓ ఉదయ్ కుమార్ వాసు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, రామ రావు వెటర్నరీ అసిస్టెంట్ సర్జరీ, మరియు మాజీ కౌన్సిలర్లు విరేశం గౌడ్, మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రంగరావు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.