యాసంగి విత్తనాలను నాణ్యమైనవి కొనాలి

Published: Thursday November 10, 2022
* జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్
వికారాబాద్ బ్యూరో 9 నవంబర్ ప్రజా పాలన : యాసంగిలో సాగు చేసే పంటలకు నాణ్యమైన, శుద్ధమైన విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రూపొందించిన నాణ్యమైన విత్తనాలకు  చిహ్నం పోస్టర్ ను డిఏఓ గోపాల్ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు నాణ్యమైన, శుద్ధమైన వరి, పెసర , మినుము,  శనగ , వేరుశనగ,  నువ్వులు, పొద్దు తిరుగుడు విత్తనాలను టీఎస్ సీడ్స్ బ్రాండ్ పేరుతో విక్రయించడం జరుగుతుందని ఆయన అన్నారు. రైతులు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న సొసైటీలు,  డీసీఎంఎస్ , ఆగ్రోస్ తదితర కేంద్రాల్లో విత్తనాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు స్వరూపారాణి,  టీఎస్ సీడ్స్ రీజినల్ మేనేజర్ కోటిలింగం,  మేనేజర్ భాస్కర్ , ఏవో టెక్నికల్ కృష్ణకాంత్ , ఝాన్సీ లు పాల్గొన్నారు.