ద్విచక్ర వాహానం పై 9 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ సునిల్ రావు

Published: Saturday June 04, 2022
డ్రైనేజీ నిర్మాణంకు భూమీ పూజ చేసి... డివిజన్ సమస్యలు పరిశీలన
 
 
* నగరంలో శివారు.. వెనుకబడిన డివిజన్ ప్రాంతాలను అభివృద్ది చేయడమే నగరపాలక సంస్థ లక్ష్యం.
 
 
* పేద ప్రజలు నివసించే...డివిజన్ ను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తాం.
 
 
* మానేరు రివర్ ఫ్రంట్ తో డివిజన్ ఒక పర్యటకంగా అభివృద్ది చెందుతుంది.
 
కరీంనగర్ మే 29 ప్రజాపాలన ప్రతినిధి :
 
నగరంలోని అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని నగర మేయర్ యాదగిరి సునిల్ రావు తెలిపారు. కరీంనగర్ అభివృద్దిలో ఆదివారం రోజు నగరంలోని 9 వ డివిజన్ లో పర్యటించారు. స్థానిక కార్పోరేటర్ ఐలేంధర్ యాదవ్ తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 11 లక్షలతో రెండు చోట్ల డ్రైనేజీ నిర్మాణంకు భూమీ పూజ చేసి పనులు ప్రారంబించారు. అనంతరం కార్పోరేటర్ తో కలిసి ద్విచక్ర వాహానం పై డివిజన్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించి... స్థానికంగా ఉన్న సమస్యలను తనిఖీ చేసి పరిశీలించారు. చేపట్టిన పనులు వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించి... పరిశీలించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సంధర్బంగా మేయర్ సునిల్ రావు మాట్లాడుతూ... మానేరు రివర్ ఫ్రంట్ తో రాబోయే రోజుల్లో 9 వ డివిజని ప్రాంతం శరవేగంగా అభివృద్ది చెంది పర్యటక ప్రాంతంగా మారుతుందన్నారు. డివిజన్ లో శివారు... వెనుబడిన ప్రాంతం... పేద ప్రజలు అధికంగా నివసించే  ప్రాంతం కాబట్టి కార్పోరేటర్ దృష్ఠికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. 9 వ డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ది చేసేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. వచ్చే 15 రోజుల్లో నగర వ్యాప్తంగా దాదాపు 25 కోట్ల రూ. నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టబోతున్నాం కాబట్టి అందులో 9 వ డివిజన్ లో కూల పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతామన్నారు. విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల డివిజన్లకు ప్రాధ్యన ఇస్తూ... నగరంలోని డివిజన్లతో సహా సమాంతరంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీస్కుంటున్నామన్నారు. నగరంలో అన్ని డివిజన్లను అభివృద్ది చేసి సమస్యలు లేని నగరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 9 వ డివిజన్ పరిదిలో గల డంపింగ్ యార్డును బయో మైనింగ్ ద్వారా ప్రక్షాలన చేసి... వాతవరణ కాలుష్యం నుండి ప్రజలకు విముక్తి కలిగిస్తామన్నారు. ఇప్పటికే బయో మైనింగ్ ప్రక్రియకు సంబందించి యంత్రాలను ఏర్పాటు చేశామని... రెండు రోజుల్లో బయో మైనింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. అంతే కాకుండ ఈ డివిజన్ లో మంచి నీటి సమస్యను తీర్చేందుకు పైపులైన్ పనులు కూడ పూర్తి ప్రస్తుతం ప్రజలకు ప్రతి రోజు నీరు అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో 9 వ డివిజన్ ప్రాంతం మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాలతో ఒక పర్యటక ప్రాంతంగా.. మరో వైపు వివిద పరిశ్రమలకు నిలయం కాబోతుందన్నారు. 9 వ డివిజన్ అల్కపూరి, ఆటోనగర్, కోతిరాంపూర్ ఏరియాలతో కూడి న పెద్ద డివిజన్ శివారు ప్రాంతం అధికంగా ఉన్న డివిజన్ కాబట్టి చాలా అభివద్ది పనులు చేపట్టి ప్రజలకు మౌళిక వసతు కల్పిస్తామన్నారు. డివిజన్ లో దశలవారిగా డ్రైనేజీలు నిర్మాణం చేసి... సీసీ రోడ్లతో సమస్యలు లేని డివిజన్ గా మార్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ ఓం ప్రకాష్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.