అంతర్జాతీయ జల దినోత్సవం వేడుకలు

Published: Tuesday March 23, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో నీటి అవసరం కూడా భవిష్యత్ తరాలకు ఇచ్చే నిధిని మేయర్ అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని అల్మాసగుడా లో రామిడి స్వరూప భీంరెడ్డి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ రామిడి శూర కర్ణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవానికి  ముఖ్య అతిథులు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.... నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వాడాలని అలాగే నీరు కలుషితం కాకుండా చూడాలని ఆమె కోరారు. అదే మన భవిష్యత్తు తరాలకు ఇచ్చే నిధి ఆని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో నీటి అవసరం కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటి సాంద్రత తగ్గకుండా ఉండేటట్లు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని అన్నారు. అలాగే చెట్లు నాటి ప్రకృతిని కాపాడుకోగలిగినపుడే భవిష్యత్తులో నీరు, గాలి సమృద్ధిగా దొరుకుతాయాని సభా ముఖంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు రామిడి మాధురి వీర కర్ణ రెడ్డి, బంగారు అనిత ప్రభాకర్, గౌర రమాదేవి శ్రీనివాస్, గడ్డం లక్ష్మారెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు రఘునందన చారి, సినీ నటుడు మానస్, సంస్థ చైర్మన్ రామిడి శూర కర్ణ రెడ్డి, నాయకులు శ్రీకాంత్ గౌడ్, రామిడి తుఫాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.